విజయనగరం, ఏప్రిల్ 17: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అవసరమైన అత్యవసర పనులకు వెంటనే ఆమోదం పొంది, పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జి జి హెచ్)లో ప్రజలకు మెరుగైన సేవలు అందించుటకు చేపట్టవలసిన అభివృద్ధి పనుల గూర్చి జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ చాంబర్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యవసరంగా చేపట్టవలసిన పనులకు త్వరితగతిన పాలనాపరమైన అనుమతులు పొందాలని, పనులను వెంటనే మొదలుపెట్టాలని ఆదేశించారు. ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ కు అవకాశం లేకుండా విద్యుత్ వైరింగ్ చేయాలని, వాటర్ పైప్ లైన్ లీకేజీ లేకుండా అరికట్టాలని, డ్రైనేజీ సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. ఆసుపత్రి నిర్వహణకు అవసరమైన నీటిని నిలువ చేయుటకు అదనపు సంపులు నిర్మించాలన్నారు. ఆసుపత్రికి నీటి కొరత లేకుండా ప్రతిరోజు సరఫరా చేయాలని మున్సిపల్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ పద్మజ, ఎ పి డి సి ఎల్ డిప్యూటీ ఇంజనీర్ కుమార్ పాల్గొన్నారు. జారీ: జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, విజయనగరం Spread the love టపా నావిగేషన్ సాలూరు లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ