PTR NAIDU చీపురుపల్లి విజయనగరం: గరివిడి మండలం కాపుశంబం గ్రామంలోని సర్వే నంబర్ 1లో ఎస్సీ, బీసీ నిరుపేద మహిళా రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన D-పట్టా భూములకు ఏళ్లు గడుస్తున్నా 1B, అడంగల్ రికార్డులు జారీ చేయకపోవడంపై జనసేన పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం బాధిత రైతులను పరామర్శించిన చీపురుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాసరావు, జనసేన సీనియర్ నాయకులు దంతులూరి రమేష్ రాజు గారు, స్థానిక నాయకులు బాలకృష్ణ, శ్రీనివాసరావు తదితరులు నేరుగా సర్వే నంబర్ 1లోని భూములను పరిశీలించారు. వాస్తవాలు: 1B నిరాకరణ: పట్టాలు ఇచ్చి ఏళ్లయినా రెవెన్యూ రికార్డుల్లో పేర్లు ఎక్కించకపోవడంతో రైతు భరోసా, పంట రుణాలు, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలు ఏవీ బాధితులకు అందడం లేదు. బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. భూ కబ్జా కుట్ర: ఇదే సర్వే నంబర్ 1లోని భూమిని ఇప్పుడు MSME పార్క్ కోసం కేటాయించినట్లు తేలింది. D-పట్టా ఇచ్చిన పేదల భూమినే మళ్లీ లాక్కునేందుకు అధికారులు కుట్ర చేస్తున్నారని రైతులు ఆరోపించారు. జనసేన స్పందన:ఈ సందర్భంగా జనసేన ఇన్ఛార్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, “పేదలకు భూమి ఇచ్చామని చెప్పి చేతులు దులుపుకుంటే సరిపోదు. 1B లేని పట్టా చిత్తు కాగితంతో సమానం. D-పట్టా రైతుల భూమిని MSME పార్క్ పేరుతో లాక్కుంటే సహించేది లేదు. న్యాయం జరిగే వరకు నిరుపేద రైతుల తరఫున ఎంతవరకైనా పోరాడతాం” అని స్పష్టం చేశారు. డిమాండ్లు: వెంటనే విచారణ జరిపి కాపుశంబం సర్వే నం.1 లోని D-పట్టా లబ్ధిదారులందరికీ 1B రికార్డులు మంజూరు చేయాలి. MSME పార్క్ కోసం కేటాయించిన స్థలంలో పేదల భూమి ఉంటే, వెంటనే ఆ కేటాయింపు రద్దు చేయాలి. ఒకవేళ భూసేకరణ తప్పనిసరి అయితే, మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం, ప్రత్యామ్నాయ భూమి ఇచ్చిన తర్వాతే సేకరించాలి. అలాగే MSME పార్క్ పేరుతో ఈ ప్రభుత్వ భూమికి నకిలీ 1బి లు సృష్టించి బినామీ పేర్ల తో ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసే ప్రయత్నం జరుగుతుందని, దానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా సహాయ సహకారాలు అందిస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు . జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని పేదలకు న్యాయం చేయాలని, లేని పక్షంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. Spread the love టపా నావిగేషన్ ఐక్య పోరాటంతో డిమాండ్లు సాధిద్దాం…ఏఐటి యుసి జిల్లా కార్యదర్శి రాధానాయుడు పోలీస్ స్టేషనుకు వచ్చే మహిళల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలి