సునీత రెడ్డి విజయనగరం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా రెండేళ్ళ పాలన పూర్తి చేసుకొని, సాధించిన విజయాల స్ఫూర్తితో జూన్ 15న విజయనగరం పట్టణం పోలీసు పరేడ్ గ్రౌండులో *”సేఫ్ అండ్ డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్”* థీమ్ తో పెద్ద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా *జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* గారు మాట్లాడుతూ – మన జిల్లాకు ఒడిస్సా రాష్ట్రం సమీపంగా ఉన్న కారణంగా ఇతర ప్రాంతాలకు విజయనగరం జిల్లా మీదుగా గంజాయి రవాణ జరుగుతున్నట్లుగా గుర్తించామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని సంకల్పించడంతో జిల్లా మీదుగా రవాణ అవుతున్న గంజాయి నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. ఒడిస్సా నుండి జిల్లా మీదుగా గంజాయి రవాణకు అవకాశం ఉన్న మార్గాలను గుర్తించి, ఆయా మార్గాల్లో శాశ్వతంగా ఐదు చెక్ పోస్టులను ఏర్పాటు చేసామన్నారు. వీటికి అదనంగా మరో 25 డైనమిక్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, ఆయా మార్గాల్లో ఆకస్మికంగా వాహన తనిఖీలను చేపట్టి, గంజాయి అక్రమ రవాణకు దాదాపు చెక్ పెట్టామన్నారు. ఇప్పటికే 170 కేసులు నమోదు చేసి, గంజాయిని పెద్ద ఎత్తున సీజ్ చేసామన్నారు. గంజాయి రవాణకు పాల్పతున్న నిందితులను అరెస్టు చేయడం, దర్యాప్తులో వారు ఇచ్చిన సమాచారంతో గంజాయి విక్రయాలు చేస్తున్న ప్రధాన నిందితులను, వారికి గంజాయిని సరఫరా చేస్తున్న కింగ్ పిన్స్ గా చలామణీ అవుతున్న వారిని అరెస్టు చేస్తున్నామని, ఇప్పటికే గంజాయి కేసులలో 609 మందిని అరెస్టు చేశామని వారికి బెయిల్ మంజూరు కాకుండా, జైళ్ళలోనే మగ్గే విధంగా చర్యలు చేపట్టామన్నారు. గంజాయి సేవించేందుకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకుంటున్న 250మందిని అరెస్టు చేసామన్నారు. గంజాయి నిందితులపై పి.డి. యాక్ట్ ను అమలు చేసి, వారు ఒక సంవత్సరం పాటు జైలు నుండి విడుదల కాకుండా చర్యలు చేపట్టామన్నారు. గంజాయి వ్యాపారంతో అక్రమ ఆస్తులు కూడబెట్టిన నిందితులకు చెందిన సుమారు రూ.5 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటి వరకు అటాచ్ చేసామని జిల్లా ఎస్పీ తెలిపారు. గంజాయి అలవాటు కారణంగా యువత చెడు మార్గాల్లో నడుస్తున్నందున వారికి మార్గనిర్దేశం చేసి, గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్ధాలను వివరించేందుకు ‘సంకల్పం’ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని దాదాపు అన్ని స్కూల్స్, కాలేజీలను పోలీసు అధికారులు, సిబ్బంది సందర్శించి, గంజాయి సేవించడం వలన కలిగే అనర్ధాలను వివరిస్తూ, వారిలో చైతన్యం తీసుకొని వస్తూ, యువత గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గంజాయి తీవ్రత, వాటి దుష్ప్రభావాలు విద్యార్థులు, యువత, ప్రజలకు అర్ధమయ్యే రీతిలో ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్లు, పామ్ ప్లేట్స్, షార్టు ఫిల్మ్స్ తో విస్తృత ప్రచారం చేస్తున్నామన్నారు. అదే విధంగా విశాఖ రేంజ్ ఐజిపి శ్రీ గోపినాధ్ జెట్టీ గారి ఆదేశాలతో రేంజ్ పరిధిలోని అన్ని జిల్లాలను, ముఖ్య ప్రాంతాలను కవర్ చేస్తూ ‘అభ్యదయం సైకిలు యాత్ర’ నిర్వహించి, ప్రజలకు విస్తృతంగా గంజాయి దుష్ప్రభావాల పట్ల అవగాహన కల్పించామన్నారు. గంజాయి కేసుల్లో ఎవరైనా పట్టుబడితే వారి జీవితం అక్కడితోనే ముగిసిపోతుందన్నారు. ఒక సారి కేసులో ఇరుక్కొంటే మరణ శిక్ష వరకు విధించే అవకాశం ఉంటుందన్నారు. కావున, ప్రజలు తమ పిల్లలు పట్ల జాగ్రత్తతో వ్యవహరించి, వారు గంజాయికి దూరంగా ఉండే విధంగా చూడాలన్నారు. గంజాయిని నిర్మూలించేందుకు జిల్లా పోలీసుశాఖ చేపడుతున్న చర్యలకు ప్రజలు కూడా తమవంతు సహకారాన్ని అందించాలని, ఎక్కడ గంజాయి గురించిన సమాచారం లభించినా 1972 లేదా డయల్ 100/112కు అందించాలని ప్రజలకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ విజ్ఞప్తి చేసారు. జిల్లా ఎస్పీ గారు కార్యక్రమానికి హాజరైన ప్రజలు, యువతతో గంజాయికి దూరంగా ఉంటామని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులం అవుతామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం, *’గంజాయి, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా నిలపడమే నా బాధ్యత, నా లక్ష్యం’* అనే సందేశంతో జిల్లా పోలీసుశాఖ ప్రత్యేకంగా రూపొందించిన గోడపత్రికను రాష్ట్ర హోంశాఖామాత్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు ఆవిష్కరించారు. సభా వేదిక సమీపంలో జిల్లా పోలీసుశాఖ మహిళల భద్రతకు చేపడుతున్న చర్యలను వివరిస్తూ ఏర్పాటు చేసిన స్టాలు, గంజాయి నియంత్రణకు ఈగల్ బృందంతో జిల్లా పోలీసుశాఖ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు, వినియోగిస్తున్న సాంకేతికతను ప్రజలకు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు సందర్శించారు. మహిళల భద్రత, గంజాయి నియంత్రణకు చేపడుతున్న అవగాహన కార్యక్రమాలతో ఏర్పాటు చేసిన ఫోటో స్టాల్, మరియు విద్యార్థులు చేసిన స్కిట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోలీసు జాగిలం రుద్ర గంజాయిని కనిపెట్టే విధానంను కార్యక్రమంకు వచ్చిన అందరు ఆసక్తిగా తిలకించి రుద్రను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హెూం మరియు అగ్ని మరియు విపత్తుల నిర్వహణ శాఖామాత్యులు శ్రీమతి వంగల పూడి అనిత గారు ముఖ్య అతిధిగాను, రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ. మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, జిల్లా కలెక్టరు శ్రీ ఎస్.రామసుందర్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ప్రజా ప్రతినిధులు, తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. Spread the love టపా నావిగేషన్ డ్రగ్స్ రహిత రాష్ట్రం ‘ థీమ్ తో జిల్లాలో విజయోత్సవ సభ నిర్వహణ.