.5 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. రహదారులు, డ్రైనేజీలు, పైపులైన్లు, రైతుబజార్‌కు ప్రాధాన్యం

బొబ్బిలి, సెప్టెంబర్ 16:
బొబ్బిలి పట్టణ అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచే లక్ష్యంతో కోట్లాది రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీనాయన), బుడా చైర్మన్/మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్ము నాయుడు, కూటమి నాయకులు శంకుస్థాపన చేశారు.

డీటీసీపీ (బి.పి.ఎస్./ఎల్.ఆర్.ఎస్.) నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టనున్న ఈ పనుల్లో సీసీ రోడ్లు, సీసీ కాలువలు, పైపులైన్లు, బీటీ రోడ్డు నిర్మాణం తదితర మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇచ్చారు.

గొల్లపల్లిలో రూ.1.10 కోట్లతో అభివృద్ధి పనులు

గొల్లపల్లి ప్రాంతంలో డీటీసీపీ (బి.పి.ఎస్./ఎల్.ఆర్.ఎస్.) నిధులు రూ.1.10 కోట్లతో సీసీ రోడ్లు, సీసీ కాలువలు, పైపులైన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న రహదారులు, డ్రైనేజీ, మౌలిక వసతుల సమస్యలకు ఈ పనులు పరిష్కార మార్గం చూపనున్నాయి.

జంగాల శివాలయం–దాడితల్లి గుడి వరకు బీటీ రోడ్డు

బొబ్బిలి పట్టణంలోని జంగాల శివాలయం నుంచి దాడితల్లి అమ్మవారి గుడి జంక్షన్ వరకు రూ.2 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు గొల్లవీధి జంక్షన్ వద్ద శంకుస్థాపన జరిగింది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ఈ మార్గంలో రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.

మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ బొబ్బిలి పర్యటన సందర్భంగా ఈ రహదారిని పరిశీలించి రూ.2.40 కోట్లను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో పనులను ప్రారంభించేందుకు శంకుస్థాపన చేసినట్లు వివరించారు.

రైల్వే స్టేషన్ జంక్షన్‌కు రూ.1.67 కోట్ల నిధులు

రైల్వే స్టేషన్ జంక్షన్ ప్రాంతంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.67 కోట్లతో సీసీ రోడ్లు, సీసీ కాలువలు, పైపులైన్ల అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేశారు. పట్టణంలోని కీలక రవాణా ప్రాంతంగా ఉన్న రైల్వే స్టేషన్ పరిసరాల్లో మౌలిక వసతులు మెరుగుపడటంతో ప్రజలకు మరింత సౌకర్యం కలగనుంది.

రూ.49 లక్షలతో నూతన రైతుబజార్

బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో రూ.49 లక్షలతో నూతన రైతుబజార్ ఏర్పాటు చేయడానికి కూడా శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రైతులు, వినియోగదారులకు ఉపయోగపడేలా రైతుబజార్‌ను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.

ప్రజల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు

బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బేబీనాయన మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధిలో ఈ రోజు ముఖ్యమైన ఘట్టమని పేర్కొన్నారు. గత కొంతకాలంగా రహదారులు, ఇతర మౌలిక వసతుల కారణంగా ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారం చూపే దిశగా అభివృద్ధి పనులు ప్రారంభమవుతున్నాయని తెలిపారు.

బొబ్బిలి పట్టణ అభివృద్ధికి అవసరమైన పనులను ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నామని, సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహించి మరిన్ని అభివృద్ధి పనుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

మల్లమ్మ పార్కు అభివృద్ధికి కూడా టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. అదేవిధంగా బొబ్బిలి ప్రాంత అభివృద్ధిలో పారాది వంతెన నిర్మాణం కూడా కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

జలజీవన్ మిషన్ ప్రాజెక్టు విషయంలోనూ సంబంధిత చర్యలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు మంజూరు చేయించారని, తద్వారా ప్రాజెక్టు ముందుకు సాగేందుకు అవకాశం ఏర్పడిందని తెలిపారు.

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో బొబ్బిలి నియోజకవర్గం కూడా కీలక భాగస్వామిగా ముందుకు సాగుతోందని బేబీనాయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపడుతున్న కార్యక్రమాల ఫలితాలు నియోజకవర్గంలోనూ కనిపిస్తున్నాయని తెలిపారు.

కూటమి నాయకులు, అధికారులు పాల్గొనగా..

ఈ కార్యక్రమాల్లో బొబ్బిలి నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్, ఆర్డీవో జే.వి.ఎస్.ఎస్.రామ్మోహన్, జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గిరడ అప్పలస్వామి, ఏఎంసీ చైర్మన్ నర్సుపల్లి వెంకటనాయుడు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వేమకోటి గిరిబాబు, మాజీ చైర్మన్ రాంబర్కి శరత్, బొబ్బిలి పట్టణ టీడీపీ అధ్యక్షుడు గెంబలి శ్రీనివాసరావు, పట్టణ మహిళా అధ్యక్షురాలు కళ్యంపూడి లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి, మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది, మాజీ కౌన్సిలర్లు, టీడీపీ వార్డు ఇంచార్జులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

– 9 NEWS | రిపోర్టర్ శ్రావణ్ కుమార్

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి