ఎంపీడీఓ, హౌసింగ్, వెలుగు, వ్యవసాయ కార్యాలయాల వద్ద నీరు చేరడంతో ఉద్యోగుల ఇబ్బందులు

బొబ్బిలి: ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా బొబ్బిలిలోని ఎంపీడీఓ కార్యాలయం, హౌసింగ్ కార్యాలయం, వెలుగు కార్యాలయం, వ్యవసాయ కార్యాలయాల పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. దీంతో ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కార్యాలయాల వద్ద నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడటంతో పాటు విధులు నిర్వహించేందుకు కూడా అసౌకర్యంగా మారింది. వర్షం కురిసిన ప్రతిసారీ ఇదే పరిస్థితి నెలకొంటుండటంతో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నీటిని తొలగించి, శాశ్వత పరిష్కారం చూపాలని ఉద్యోగులు కోరుతున్నారు.


✍️ 9 NEWS | రిపోర్టర్ శ్రావణ్ కుమార్

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి