విజయనగరం, ఆగస్టు 3,
శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభ ప్రస్థానంలో కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి కీలకపాత్ర పోషించారని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ గారి కార్యాలయం నందు కలెక్టర్ ఎస్ రామ సుందర్ రెడ్డి గారిని కలసి శాలువాతో సత్కరించి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ గారి విమానాశ్రయ ప్రారంభం షెడ్యూల్ విడుదలైన నాటి నుండి పగడ్బందీగా ఏర్పాట్లు చేయడం, కృత నిశ్చయంతో విధులు నిర్వహించారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు, యువ నాయకులు నారా లోకేష్ గారి సారధ్యంలో, ప్రత్యేక పరిశీలకులు, మంత్రుల సూచనలు పాటించి అన్ని శాఖల అధికారులను సమన్వయం చేయటంతోనే ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా ప్రారంభ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగామని ప్రశంసించారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులకు, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అభినందనలు తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి