ప్రధాన మంత్రి పర్యటనకు భద్రత ఏర్పాట్ల పర్యవేక్షణ
*విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్*

క్షేత్ర స్థాయిలో భద్రత ఏర్పాట్లును పరిశీలించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ మరియు జిల్లా కలెక్టరు ఎస్.రాంసుందరరెడ్డి,ఐఎఎస్*

ప్రధాన మంత్రి పర్యటనలో భాగంగా హెలిప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ స్థలంను పరిశీలించిన జిల్లా ఎస్పీ*

రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా,ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రధాన మంత్రి పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేపడుతున్నామన్న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్*

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు జిల్లాలో భోగాపురం మండలంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి ఆగస్టు 1న విచ్చేస్తున్న సందర్భంగా రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా,ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో సభా వేదిక, పార్కింగ్,
ప్రజా రవాణా, మరియు భద్రత, బందోబస్తు ఏర్పాట్లును జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మరియు జిల్లా కలెక్టరు ఎస్. రామసుందరరెడ్డి సంయుక్తంగా జులై 19న పరిశీలించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటనలో భాగంగా ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్, ప్రజా వేదికను సందర్శించి, నిర్మాణ పనులను, ఏర్పాట్లును పరిశీలించి, సంబంధిత అధికారులకు జిల్లా ఎస్పీ పలు సూచనలు చేసారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనాల పార్కింగ్ విషయంలో ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘాను పటిష్టం చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ వివరించారు. ప్రాథమికంగా బందోబస్తును నాలుగు సెక్టార్లుగా విభజించడం జరిగిందని బహిరంగ సభకు హాజరయ్యే ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు పి.సౌమ్యలత, పి.కిరణ్ కుమార్, డిఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ఇతర అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి