*సాలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 శాతం విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని నియోజకవర్గ స్థాయి టీడీపీ క్యాడర్ సమావేశం నిర్వహించిన మంత్రి సంధ్యారాణి* *స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు* *టిడిపి వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి* *అనంతరం జరిగిన సమావేశంలో ఒకపక్క కూటమి పార్టీలతో సమన్వయాన్ని పాటిస్తూనే మరోపక్క వైసీపీ ఎత్తుగడలను చిత్తుచేయాలని పిలుపునిచ్చారు.* *పొరపచ్చాలు, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి కూటమి ఐక్యతా ధర్మాన్ని పాటిస్తూ అందరి అభ్యర్థుల విజయానికి అంకితభావంతో కృషి చేయాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు* *పనితీరు, విదేయతలే స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థుల ఎంపికకు ప్రామాణికాలని మంత్రి స్పష్టం చేసారు* *గతంలో అధికారంలో ఉన్నప్పుడు దొంగల మాదిరిగా రాష్ట్రాన్ని దోచుకున్న వైసీపీ నాయకులు,,, నిస్సిగ్గుగా బయట పెద్ద మనుషులుగా చలామణి అయ్యేందుకు మాత్రమే తిప్పలు పడుతున్నారంటూ దుయ్యబట్టారు.* *గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లతో వారిని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తరిమి కొట్టిన విధంగానే స్థానిక ఎన్నికల్లోనూ కూటమి వందశాతం గెలవాలని శ్రేణులకు మంత్రి సంధ్యారాణి దిశానిర్దేశం చేశారు.* *టీడీపీలో కష్టపడే తత్వం ఉన్న వారితో పాటూ అందరి డేటా తెలుగుదేశం పార్టీ అధిష్టానం వద్ద ఉందని పేర్కొన్నారు.* *రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమి మిత్ర ధర్మాన్ని కాపాడుతూనే గెలుపు ముంగిట ప్రతి అభ్యర్ధిని నిలపాల్సిన బాధ్యతను ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు* *రానున్న 2029 సార్వత్రిక ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలే పునాది వంటివని రిజర్వేషన్లు తేలిన తర్వాత అభ్యర్ధుల ఎంపిక ఉంటుందని, ఆ సమయంలో సమన్వయంతోనే వ్యవహరించాలంటూ మంత్రి సూచించారు.* *ప్రజల్ని దోచుకున్న వైసీపీకి ఎక్కడా గెలిచే అవకాశమే లేకుండా చేయాలంటూ శ్రేణులకు పిలుపునిచ్చారు మంత్రి సంధ్యారాణి* సమావేశంలో టీడీపీ పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు… Spread the love టపా నావిగేషన్ శాంతియుత వినాయక ఉత్సవాలే లక్ష్యం