సాలూరు టౌన్ పరిధిలో గ్రామీణకూట్ క్రెడిట్ యాక్సెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళలకు సైబర్ భద్రత, మహిళల భద్రత మరియు ఆర్థిక మోసాలపై అవగాహన కల్పించబడింది.

ఈ సందర్భంగా సైబర్ మోసాలు, నకిలీ మొబైల్ యాప్‌లు (Fake Apps), డిజిటల్ లోన్స్, మైక్రో ఫైనాన్స్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాలు, UPI మరియు OTP మోసాల గురించి వివరించారు. OTP, UPI PIN, CVV, బ్యాంకు ఖాతా వివరాలు మరియు పాస్‌వర్డ్‌లను ఎవరికీ తెలియజేయరాదని, అనుమానాస్పద లింకులు మరియు ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అలాగే మహిళల భద్రతకు సంబంధించి ఒంటరిగా ప్రయాణించే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో డయల్-112 మరియు సైబర్ మోసాల ఫిర్యాదుల కోసం 1930 హెల్ప్‌లైన్‌ను వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు.

ప్రజలు సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల పట్ల అప్రమత్తంగా ఉండి సురక్షితమైన డిజిటల్ లావాదేవీలు నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామీణకూట్ క్రెడిట్ యాక్సెస్ సిబ్బంది, మహిళలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి