భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన “నషా ముక్త్ భారత్ అభియాన్” లో భాగంగా నేడు సాలూరు పట్టణంలో మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నంకు చెందిన శ్రీ సతీష్ కుమార్ సాంస్కృతిక బృందం పాటలు, డప్పుల ప్రదర్శనలు నిర్వహిస్తూ విద్యార్థులు, యువత మరియు ప్రజలకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం శ్రీ సత్యసాయి కళాశాల మరియు బొసుబొమ్మ జంక్షన్ వద్ద నిర్వహించబడింది. మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే అనర్థాలు, యువత భవిష్యత్తుపై వాటి ప్రభావం, కుటుంబాలు మరియు సమాజంపై కలిగే దుష్పరిణామాల గురించి సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ప్రజలకు వివరించారు. విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, విద్య, క్రీడలు మరియు సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. తమ పరిసర ప్రాంతాల్లో మాదకద్రవ్యాల విక్రయాలు లేదా వినియోగం గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ శ్రీ వెంకటేశ్వరరావు గారు మరియు ఏఎస్పీ శ్రీమతి మనీషా రెడ్డి గారి పర్యవేక్షణలో నిర్వహించబడింది. కార్యక్రమంలో ఈగిల్ బృందం, పోలీసు సిబ్బంది, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు, యువత మరియు ప్రజలు పాల్గొని మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. సాలూరు టౌన్ పోలీసులు మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుబడి ఉన్నారని, ప్రజలందరూ పోలీసులకు సహకరించి సమాజాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దాలని కోరారు. Spread the love టపా నావిగేషన్ సాలూరు టౌన్ పరిధిలో గ్రామీణకూట్ క్రెడిట్ యాక్సెస్ ఆధ్వర్యంలో మహిళలకు సైబర్ భద్రత, మహిళల భద్రత మరియు ఆర్థిక మోసాలపై అవగాహన కార్యక్రమం