సునీత రెడ్డి విజయనగరం

కానిస్టేబుల్ కుమారుడి అత్యవసర చికిత్సకు గంటలో రూ.5 లక్షల రుణం మంజూరు
*విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్*

విజయనగరం జిల్లాలో కానిస్టేబులుగా ఎంపికై ప్రస్తుతం ఈగల్ విభాగంలో డిప్యుటేషన్ పై పని చేస్తున్న బి.చరణ్ కుమార్ కుమారుడికి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం రూ.5 లక్షల రుణాన్ని గంట వ్యవధిలోనే జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మంజూరు చేసి, చెక్ ను కానిస్టేబుల్ చరణ్ కుమార్ కు అందజేసినట్లుగా జూన్ 24న తెలిపారు.

జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ గారు మాట్లాడుతూ – పోలీసు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అవసరమైన సంక్షేమ చర్యలను ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో పోలీసు కానిస్టేబులుగా ఎంపికై, ప్రస్తుత ఈగల్ విభాగంలో డిప్యుటేషన్ పై పనిచేస్తున్న బి.చరణ్ కుమార్ ఏకైక కుమారుడు చిరంజీవి బి.లవ్యాన్ష్ (ఒకటిన్నర సం.లు) గత కొన్ని మాసాలుగా లివర్ కేన్సర్ తో ఇబ్బందులు పడుతున్నట్లు, ప్రస్తుతం చి.లవ్యాన్ష్ కు హైదరాబాద్ లో లివర్ కేన్సర్ కి సంబంధించి అత్యవసర శస్త్ర చికిత్స చేయాలని, అత్యవసరంగా నగదు అవసరం ఉందని కానిస్టేబులు చరణ్ కుమార్ తన దృష్టికి తీసుకొని రావడం జరిగిందన్నారు. వెంటనే, ఈ విషయాన్ని ప్రత్యేకంగా తీసుకొని జిల్లా పోలీసు ఉద్యోగుల కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ నుండి ఒక గంట వ్యవధిలో కానిస్టేబులు చరణ్ కుమార్ కు రూ. 5 లక్షల రుణాన్ని మంజూరు చేసినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ డబ్బును చి.లవ్యాన్ష్ శస్త్ర చికిత్సకు వినియోగించుకోవాలని, లవ్యాన్ష్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటికి చేరుకోవాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. కానిస్టేబుల్ చరణ్ కుమార్ దంపతుల కుమారుడు చి. లవ్యాన్ష్ కు ఏమీ కాదని, ఆరోగ్యంతో తిరిగి వస్తాడని, అధైర్య పడవద్దని జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ అతనికి మనోధైర్యాన్ని కల్పించారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి