*విజయనగరం, ఆగస్టు 3:* డీఎస్సీ–2025 ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న అవకతవకలు, పరీక్ష నిర్వహణలో జరిగిన లోపాలు, అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ *విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు,* మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు, మాజీ ఎంపీ శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ సంభంగి చిన్నప్పలనాయుడు గారు, శ్రీ బొత్స అప్పలనరసయ్య గారు, శ్రీ బడుకొండ అప్పలనాయుడు గారు, శ్రీ కడుబండి శ్రీనివాసరావు గారు, రాజాం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ తలై రాజేష్ గారు, నియోజకవర్గ పరిశీలకులు శ్రీమతి స్వాతిరాణి గారు, శ్రీ నాయుడు బాబు గారు, శ్రీ కె.వి. సూర్యనారాయణ రాజు గారు, శ్రీ జగన్మోహన్ రావు గారు తదితర ముఖ్య నాయకులతో కలిసి ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను గారు మాట్లాడుతూ, డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో పారదర్శకత పూర్తిగా లోపించిందని, వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. పరీక్ష నిర్వహణ నుంచి ఫలితాల విడుదల వరకు అనేక సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదన్నారు. వినతిపత్రంలో డీఎస్సీ–2025 పరీక్షల్లో చోటుచేసుకున్న అక్రమాలు, అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలు, ఫలితాలపై నెలకొన్న అనుమానాలు, పరీక్ష నిర్వహణలో ఏర్పడిన సాంకేతిక లోపాలు, నియామక ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం, మెరిట్ జాబితా రూపకల్పనలో వచ్చిన అభ్యంతరాలు వంటి అంశాలను సమగ్రంగా వివరించినట్లు తెలిపారు. అలాగే టీచర్ పోస్టుల భర్తీలో అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై హైకోర్టు పర్యవేక్షణలో లేదా స్వతంత్ర ఉన్నతస్థాయి కమిటీతో సమగ్ర విచారణ జరిపించాలని, విచారణ పూర్తయ్యే వరకు వివాదాస్పద నియామక ప్రక్రియపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణలో లోపాలకు కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, అభ్యర్థుల ఫిర్యాదులను అధికారికంగా స్వీకరించి వాటిపై నిష్పాక్షిక విచారణ చేపట్టాలని వినతిపత్రంలో కోరారు. అదేవిధంగా మెరిట్, అర్హత ఆధారంగానే నియామకాలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాన్ని కొనసాగిస్తుందని చిన్న శ్రీను గారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ ఎయిర్పోర్ట్ ప్రారంభ ప్రస్థానంలో కలెక్టర్ గారు కీలక పాత్ర – కలెక్టర్ రామ సుందర్ రెడ్డి గారికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అభినందనలు