*గరివిడి, ఆగస్టు 15:* గరివిడి మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే *కిమిడి కళా వెంకట్రావు* గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళా వెంకట్రావు గారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవడంతో పాటు, దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

*మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.38.42 కోట్ల బ్యాంక్ లింకేజ్*

2026 ఏప్రిల్ నెల నుంచి గరివిడి మండలంలో *బ్యాంక్ లింకేజ్, శ్రీనిధి ద్వారా 472 స్వయం సహాయక సంఘాలకు చెందిన 4,832 మంది సభ్యులకు రూ.38.42 కోట్ల మేర ఆర్థిక సహాయం* అందించినట్లు అధికారులు తెలిపారు. ఈ నిధులను మహిళలు స్వయం ఉపాధి, చిన్నతరహా వ్యాపారాలు, కుటుంబ ఆర్థికాభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు.

వీఆర్వో వెయిటింగ్ హాల్ ప్రారంభం

గరివిడి ఎమ్మార్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన *వీఆర్వో వెయిటింగ్ హాల్‌ను* ఎమ్మెల్యే కళా వెంకట్రావు గారు ప్రారంభించారు. ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఇటువంటి వసతులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు.

*ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు ప్రశంసా పత్రాలు*

ప్రభుత్వ విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళా వెంకట్రావు గారు *ప్రశంసా పత్రాలతో సత్కరించారు.* ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించారు.

అలాగే కార్యక్రమానికి హాజరైన *విలేకరులకు జ్ఞాపికలను అందజేసి సత్కరించారు.* ప్రజా సమస్యలను ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడంలో మీడియా పోషిస్తున్న పాత్రను ఎమ్మెల్యే ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి