*రాష్ట్ర పార్టీ కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న Ap Gen-Z WAR రిలే నిరాహార దీక్ష తొలి రోజు శ్రీమతి డాక్టర్ బొత్స అనూష ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది*

*ఉదయం ప్రారంభమైన Ap Gen-Z WAR రిలే నిరాహార దీక్ష సాయంత్రం వరకు విజయవంతంగా కొనసాగింది. డా. శ్రీమతి బొత్స అనూష రోజంతా దీక్షా శిబిరంలోనే ఉండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువతతో కలిసి నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ,మాజీ ఎంపీ శ్రీ బెల్లాన చంద్రశేఖర్ పాల్గొని నిరసన దీక్షకు సంఘీభావం తెలియజేశారు.*

*అనంతరం మాజీ ఎంపీ శ్రీ బెల్లాన చంద్రశేఖర్ దీక్షా శిబిరానికి విచ్చేసి, నిరాహార దీక్షలో పాల్గొన్న డా. శ్రీమతి బొత్స అనూష తో పాటు దీక్షకారులకు నిమ్మరసం అందించి తొలి రోజు రిలే నిరాహార దీక్షను విరమింపజేశారు.*

*ఈ సందర్భంగా డా. శ్రీమతి బొత్స అనూష మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ సూచనల మేరకు* స్పందించి దీక్షను విజయవంతం చేసిన గుర్ల మండల పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మరియు నియోజకవర్గ యువజన, విద్యార్థి, సోషల్ మీడియా విభాగాల ప్రతినిధులకు, కార్యకర్తలకు, అలాగే పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపిన విద్యార్థులు, యువతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.*

ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టే ఉద్యమాలకు ఇదే స్ఫూర్తితో అందరూ అండగా నిలవాలని పిలుపునిస్తూ, తొలి రోజు Ap Gen-Z WAR రిలే నిరాహార దీక్షకు విరామం పలికారు.

* ఈ కార్యక్రమంలో నియోజకవర్గాల పరిశీలకులు శోభా స్వాతి రాణి , కేవీ సూర్యనారాయణ (పులిరాజు ) ,గుర్ల మండల నాయకులు సన్యాసి నాయుడు ,యువ నాయకులు బెల్లాన వంశీ కృష్ణ ,అప్పల నాయుడు గారు, ఈశ్వరరావు ,బంగారు నాయుడు , స్వామి నాయుడు ,తిరుపతి , మధుసూదన్ , చిన్నారావు ,విద్యార్ధి నాయకులు కార్తీక్ ,కెల్ల సురేష్ , మరియు చీపురుపల్లి నియోజకవర్గం 4 మండలాల చెందిన ముఖ్య నాయకులు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన, విద్యార్థి, సోషల్ మీడియా విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీక్షను విజయవంతం చేశారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి