సాలూరు: పూసపాటి రేగలో బుధవారం సాయంత్రం విశాలాంధ్ర విలేఖరి గోవిందరావుపై జరిగిన దాడిని ఖండిస్తూ సాలూరులో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. ఎస్జేడబ్ల్యూఏ (SJWA) సాలూరు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాలూరు రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను వెలుగులోకి తీసుకువస్తున్న జర్నలిస్టులపై దాడులకు పాల్పడటం అమానుషమని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై దాడుల విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని( స్వ) డిమాండ్ చేసింది. జర్నలిస్టులకు రక్షణ కల్పించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణంతో పాటు నియోజకవర్గ పరిధిలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ సాలూరు టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో “ఇంటి ఇంటికీ మన్యం పోలీస్” కార్యక్రమం