పాచిపెంట మాదక ద్రవ్యాలు బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని గ్లోబల్ స్ఫూర్తి మహిళా మండలి రాష్ట్ర డైరెక్టర్ బలగ రాదా నాయుడు అన్నారు. మండలంలో కిేరంగి పంచాయతీ నందేడ వలస గ్రామంలో బుధవారం మాదకద్రవ్యాలు నియంత్రణపై అవగాహన సదస్సును గ్లోబల్ స్ఫూర్తి మహిళా మండలి మరియు పోలీస్ శాఖ ల ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా స్ఫూర్తి మహిళా మండలి రాష్ట్ర డైరెక్టర్ బలగ రాదా నాయుడు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు అలవాటు చేసుకుంటే భవిష్యత్తు నాశనం జరుగుతుందని తెలిపారు. గంజాయి, నాటు సారా చెడు అలవాట్లు పట్ల యువత ఆకర్షిస్తున్నారని అన్నారు. చెడు అలవాట్లు పట్ల ఆకర్షితులు కాకుండా యువత మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగ అవకాశాలను పొందాలని కోరారు. అప్పుడే కుటుంబ అభివృద్ధి మరియు గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. అలాగే చిల్లంగి, చేతబడుల లాంటి మూఢనమ్మకాలను నామవద్దని కోరారు. మూఢనమ్మకాల నమ్మటం వలన ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు సమాజంలో ఏర్పడుతున్నాయని అన్నారు. అనంతరం ఎస్సై అర్జున్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని గ్రామంలో మాదక దలవ్యాలు, మూఢనమ్మకాలు, మహిళా చట్టాలు, రోడ్డు భద్రత నియమాలు, బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బాల్య వివాహాలు చేసుకోవడం వలన బడుగు నష్టాలపై అవగాహన కల్పచారు. గిరిజన ప్రాంతాలలో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా బాలివివాహాలను ఏజెన్సీ ప్రాంతాల్లోనే అవగాహన కల్పించి వాటిని అరికట్టే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు దాటిన తర్వాత వ్యవహాలు చేసుకోవాలని సూచించారు. ఇలా సరైన సమయంలో వివాహాలు చేసుకోవడం వలన వంశం వృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సామల లచ్చయ్య, మహిళా పోలీసు విజయ, గిరిజనలు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ గుమ్మలక్ష్మీపురం బాలికల కళాశాల ఘటనపై సమగ్ర విచారణ జరపాలి. సాలూరు విశ్వబ్రాహ్మణ సంఘానికి తీరని లోటు