*శాంతిభద్రతల అంశంపై జిల్లా ఎస్పీలు, కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.* *జీరో డ్రగ్స్, జీరో టాలరెన్స్ ఆన్ విమెన్ అట్రాసిటీస్, జీరో రోడ్ యాక్సిడెంట్స్ లక్ష్యంగా త్రిశూల్ పేరుతో కమిటీ ఏర్పాటుకు సీఎం ఆదేశం* *ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…* • జీరో డ్రగ్స్, జీరో టాలరెన్స్ ఆన్ విమెన్, జీరో రోడ్ యాక్సిడెంట్స్ లక్ష్యంగా కమిటీ వేసి కార్యాచరణను రూపొందించాలి. • త్రిశూల్ పేరిట ఈ మూడు అంశాలపై రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు చేయాలి. • సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు, అభ్యంతరకమైన కంటెంట్ పై కఠిన చర్యలు తీసుకోవాలి. • సోషల్ మీడియా ఆగడాలపై మంత్రుల కమిటీ మరింత లోతుగా అధ్యయనం చేయాలి. • వ్యవస్థీకృతంగా సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న వేధింపులపై మరింత దృష్టి పెట్టాలి. • కానిస్టేబుళ్లలో టెక్నాలజీపై అవగాహన ఉన్న వారిని 30 మందిని జిల్లాలకు కేటాయించాం. • సైబర్ టెక్నాలజీ లో నిపుణుల్ని సీఐడీలో ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేసుకోండి. • మహిళల భద్రతపై ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. • గంజాయి సహా డ్రగ్స్ లాంటి నేరాల నియంత్రణపై క్యాలెండర్ పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. • విశాఖ, తిరుపతి, అమరావతిలో డీఅడిక్షన్ ఎక్స్ లెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయండి. • రోడ్ సేఫ్టీ, ప్రమాదాలు సహా వివిధ ప్రధాన నేరాలపై జిల్లాల వారీగా వివిధ శాఖల సమన్వయంతో సమీక్షించాలి. • ప్రతీ ప్రమాదాన్ని ఆడిట్ చేయండి. కారణాలను వెలికి తీయండి. • అంబులెన్స్ లు ఎంత సమయానికి చేరుకోగలుగుతున్నాయి. ప్రమాదాలకు కారణాలేమిటన్నది విశ్లేషించాలి. • రోడ్డు ప్రమాదాల విషయంలో జాతీయ స్థాయిలో ఏపీ మొదటి స్థానంలో ఉంది. • గడచిన రెండేళ్లలో 14 శాతం మేర నేరాలు తగ్గుముఖం పట్టాయి. • ప్రతీ జిల్లాలో 30 మంది పోలీసులతో జిల్లా యాక్షన్ అండ్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేశారు. • సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను డీజీపీ కార్యాలయంలో నియమించారు. • నేరాల కట్టడిపై దృష్టి పెడితే ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్ధిక నేరాలు కూడా తగ్గుముఖం పట్టాయి. • కొన్ని జిల్లాల్లో మాత్రం ఆర్ధికనేరాలు ఎందుకు పెరిగాయో విశ్లేషించుకోవాలి. • 29.2 శాతం ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నేరాలు దిగి వచ్చాయి. • శాస్త్రీయంగా చేస్తున్న దర్యాప్తు విషయంలో రెండేళ్లలో 3 శాతం వృద్ధి కనిపించింది. • క్రిటికల్ కేస్ లలో డీఎన్ఏ పరీక్షలు ఫలితాలకు పట్టే 6 గంటల సమయం మరింత తగ్గాలి. • నేరాలు జరిగిన ప్రాంతానికి 30 నిముషాల్లోపే చేరుకోవాలి. • నేరం జరిగే ప్రాంతానికి ఎంత త్వరగా వెళ్తే అంత ఫలితం ఉంటుందన్నది గుర్తించాలి. • కన్విక్షన్ రేట్ 47 శాతంగా ఉంది. ఆధారాలను సేకరించుకోగలిగితే… కన్విక్షన్ రేట్ మరింత పెరుగుతుంది. • కోర్టు కేసులను పరిష్కరించుకునేందుకు వన్ కోర్టు-వన్ కానిస్టేబుల్ అనే విధానం ఉండాలి. • ప్రాంతీయంగా ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలి. డాగ్ స్క్వాడ్ లను కూడా నియమించండి. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్, ఐపీఎస్ గారు, జిల్లా కలెక్టరు శ్రీ ఎస్.రామసుందర్ రెడ్డి, ఐఎఎస్ గారు పాల్గొని, జిల్లా ప్రగతికి, అభివృద్ధికి, శాంతిభద్రతల పరిరక్షణకు, గంజాయి నిర్మూలనకు, మహిళల భద్రతకు, నేరాల నియంత్రణకు చేపడుతున్న చర్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వివరించారు. Spread the love టపా నావిగేషన్ తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా ఆనందం గా ఉంది…. మజ్జి శ్రీనివాసరావు ప్రశ్నిద్ధాం.. హక్కులు సాధిద్దాం ఎపిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు