*గోవా, సెప్టెంబర్ 13:* తెలుగుదేశం పార్టీలో చేరిన అనంతరం *ఉమ్మడి విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గోవా గవర్నర్ *శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారిని* గోవాలోని గవర్నర్ బంగ్లాలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను గారితో పాటు ఆయన కుమార్తె *శ్రీమతి మజ్జి సిరి సహస్ర కూడా గవర్నర్ అశోక్ గజపతిరాజు గారిని కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ గారితో ఆత్మీయంగా మాట్లాడి, పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో *విజయనగరం శాసనసభ్యురాలు శ్రీమతి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు కూడా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో తన కొత్త రాజకీయ ప్రయాణం నేపథ్యంలో అశోక్ గజపతిరాజు ని కలసి ఆయన ఆశీస్సులు తీసుకోవడం ఎంతో ఆనందంగా, గౌరవంగా ఉందని చిన్న శ్రీను గారు తెలిపారు. విజయనగరం, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి పెద్దల సూచనలు, ఆశీస్సులతో ముందుకు సాగుతానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు చిన్న శ్రీను కి, సిరి సహస్ర (సిరమ్మ) కి శుభాకాంక్షలు, ఆశీస్సులు అందించారు. Spread the love టపా నావిగేషన్ ప్రశ్నిద్ధాం.. హక్కులు సాధిద్దాం ఎపిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు