రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి నాయకులతో మంత్రి సంధ్యారాణి చర్చించారు.
కూటమి పార్టీల మధ్య సమన్వయంతో ముందుకు సాగాలని నాయకులకు మంత్రి సూచించారు.
గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూటమి నాయకులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి తెలిపారు.కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేసేలా పనిచేయాలని నాయకులకు సూచించారు.టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకుల మధ్య సమన్వయం మరింత పటిష్టంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తో పాటు మన్యం జిల్లా ఇంచార్జి దాడి రత్నాకర్ పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి