అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహక వేడుకల్లో భాగంగా మక్కువ మండలంలో శంబర గ్రామం వెళ్లే దారిలో వెంగళరావు సాగర్ ఏనుగు కొండ దగ్గర నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి .
అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మన జీవితంలో యోగా భాగమైనప్పుడే ఆనందకరమైన జీవితం సాధ్యమవుతుంది.
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో జరుపుకోవడం తెలుగు ప్రజల అదృష్టంగా భావిస్తున్నాను. జూన్ 21న జరగబోయే యోగా దినోత్సవ వేడుకల్లో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు 5,00,000 మంది ప్రజలు పాల్గొనబోతున్నారు.










