పాచిపెంట, సాలూరు, రామభద్రపురం మండలాల్లోని 26 గ్రామాల 12,222 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కర్రివలస ఆనకట్ట కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 4,656 ఎకరాలకు నీటి పంపిణీ గత ప్రభుత్వం 5 సంవత్సరాలు రిజర్వాయర్ కు నిధులు మంజూరు చేయక పూడికలు తొలగింపులు, జంగిల్ తొలగింపులు చేయక రైతులు చాల ఇబ్బంది పడ్డారు అని మంత్రి సంధ్యారాణి అన్నారు.ఖరీఫ్–2026కు ముందస్తుగా కాలువల్లో పూడిక తొలగింపు, గట్టు బలోపేతం, జంగిల్ తొలగింపు పనులు పూర్తి చేశామని అన్నారు.రూ.84.40 లక్షలతో 19 నిర్వహణ పనులకు ప్రభుత్వం అనుమతి – అన్ని పనులు సకాలంలో పూర్తికాలువల నీటి ప్రవాహ సామర్థ్యం పెరిగి చివరి ఆయకట్టు వరకు సాగునీరు చేరేలా చర్యలు తీసుకున్నాం అని రోజుకు 150 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తే సుమారు 44 రోజుల పాటు సాగునీరు అందుబాటులో ఉంటుంది అన్నారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీటి సరఫరాకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని మంత్రి తెలిపారు. Spread the love టపా నావిగేషన్ సెంచూరియన్ యూనివర్సిటీని సందర్శించిన మాజీ ఉపముఖ్యమంత్రి రాజన్నదొర