సాలూరు పట్టణ 17వ వార్డు మాజీ కౌన్సిలర్,సీనియర్ రాజకీయ నాయకులు *యర్రా.దాలి నాయుడు(80సం.లు)గారు* గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్యులు సూచనలు మేరకు ఇంటి వద్దనే చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మరణించారు. ఈ విషయం తెలుసుకున్న *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు& మాజీ గిరిజన సంక్షేమ శాఖా మాత్యులు శ్రీ పీడిక.రాజన్నదొర ఈరోజు ఉదయం సాలూరు పట్టణం, వెలమపేటలోనున్న యర్రా.దాలినాయుడు గారి నివాసానికి వెళ్లి ఆయన భౌతికాయాన్ని సందర్శించి పూలమాల వేసి దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.ఆయన ఆకస్మిక మృతి అత్యంత బాధాకరమని,ఆయన మరణ వార్త సాలూరు పట్టణ వైసీపీకి తీరని లోటని అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ సందర్భంగా దాలినాయుడు గారి కుటుంబ సభ్యులతో *మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర* గారు మాట్లాడుతూ వారిని ఓదార్చుతూ ధైర్యం తెలిపి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ ప్రజాప్రతినిధులు,పలు రాజకీయ పార్టీ నాయకులు,కార్యకర్తలు, స్నేహితులు,బంధువులు,పట్టణ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు..







