పాచిపెంటలో వైఎస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణ సమావేశం.

పాచిపెంటలో వైఎస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణ సమావేశం.

పాచిపెంటలో వైఎస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణ సమావేశం.                                                                               *ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు మరియు రాష్ట్ర కార్యదర్శి,జడ్పీ వైస్ చైర్మన్ మరిశర్ల.బాపూజీ నాయుడు                                           *గ్రామస్థాయిలో వైసీపీ పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణంపై నేతలు దృష్టి సారించాలి : మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర                                                                            సమిష్టి కృషితో పార్టీ బలోపేతానికి,జగనన్నను మళ్ళీ సీఎం చేసేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి: జడ్పీ వైస్ చైర్మన్ బాపూజీ నాయుడు                                                            సాలూరు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు *వైసిపి అధినేత,మాజీ సీఎం శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి* గారి ఆదేశాలు మేరకు ఈరోజు *పాచిపెంట మండల కేంద్రం* లో వైసీపీ శ్రేణులతో నిర్వహించిన *వైఎస్ఆర్సిపి సంస్థాగత నిర్మాణ సమావేశం* లో *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు& రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు శ్రీ పీడిక.రాజన్నదొర* గారు మరియు *వైసీపీ రాష్ట్ర కార్యదర్శి,చీపురుపల్లి, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులు, ఉమ్మడి విజయనగరం జడ్పీ వైస్ చైర్మన్ శ్రీ మరిశర్ల.బాపూజీ నాయుడు గారు* హాజరయ్యారు. ఈ సందర్భంగా *మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర* గారు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో వైసీపీ కమిటీలు ఏ విధంగా వేయాలో దిశానిర్దేశం చేశారు,పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషిచేసి సకాలంలో అవి పూర్తి చేయాలని తెలిపారు.పార్టీ కోసం కృషి చేసిన ప్రతి నాయకునికి,కార్యకర్తకు రానున్న రోజుల్లో పార్టీ అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తుందని తెలిపారు. తదనంతరం *వైసీపీ రాష్ట్ర కార్యదర్శి,జడ్పీ వైస్ చైర్మన్ బాపూజీనాయుడు* గారు మాట్లాడుతూ గ్రామస్థాయిలో సంస్థాగత నిర్మాణ కమిటీలు గూర్చి దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు.ప్రజా సమస్యలపై పోరాటమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మార్గమని పేర్కొన్నారు.రానున్న ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయడంకా మోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ,వైయస్‌ జగన్‌ గారి నాయకత్వంలోనే రాష్ట్రానికి నిజమైన అభివృద్ధి,సంక్షేమం సాధ్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాచిపెంట ఎంపీపీ ప్రమీల గారు,వైస్ ఎంపీపీలు నారాయణమ్మ గారు,ధనుంజయ గారు,వైసీపీ మండల అధ్యక్షులు గొట్టాపు.ముత్యాలు నాయుడు గారు,మండల వైసీపీ సమన్వయకర్త పాచిపెంట.వీరంనాయుడు గారు, వైసిపి ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,సోషల్ మీడియా సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి