రిటైర్డ్ ఉపాధ్యాయులు వంగపండు.రాజేంద్రప్రసాద్ గారిని పరామర్శించిన రాజన్నదొర సాలూరు పట్టణం,శ్రీనివాస్ నగర్ కాలనీలో నివాసముంటున్న రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు వంగపండు.రాజేంద్ర ప్రసాద్ గారికి ఇటీవలే నరాలకు సంబంధించి శస్త్ర చికిత్స జరిగి వైద్యుల సలహాలు మేరకు ఆయన ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటున్నారు.ఈ విషయం తెలుసుకున్న *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు శ్రీ పీడిక.రాజన్నదొర* ఈరోజు శ్రీనివాస్ నగర్ కాలనీకి వెళ్లి రిటైర్డ్ ఉపాధ్యాయులు రాజేంద్రప్రసాద్ గారిని పరామర్శించారు.ఈ సందర్భంగా రాజన్నదొర రిటైర్డ్ మాస్టర్ రాజేంద్రప్రసాద్ గారితో మాట్లాడుతూ ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని పలు ఆరోగ్య సలహాలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు,కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

