కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి 138 జీఓ ప్రకారం సకాలంలో వేతనాలు చెల్లించాలి

కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి 138 జీఓ ప్రకారం సకాలంలో వేతనాలు చెల్లించాలి

కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి…….. ఏటియుసి జిల్లా కార్యదర్శి  బలగ. రాధా నాయుడు……….. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి 138 జీఓ ప్రకారం సకాలంలో వేతనాలు చెల్లించాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి బలగ.రాధానాయుడు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాలోని సాలూరు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి వద్ద సానిటరీ వర్కర్స్ సెక్యూరిటీ గార్డ్స్ పెస్ట్ కంట్రోల్ సిబ్బందితో  నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సానిటరీ వర్కర్స్  సెక్యూరిటీ గార్డ్స్ పెస్ట్ కంట్రోల్ కాంట్రాక్ట్ వర్కర్స్ కు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని, 138 జీవో ప్రకారంగా జీతాలు చెల్లించాలని, పండగ సెలవులు 15 రోజులు జాతీయ సెలవులు ఎనిమిది రోజులు వర్తింపజేయాలని కోరారు. అంతేకాకుండా 138 జీఓ అధిక శాతం కోతలు విధించకుండా నేరుగా కార్మికుని అకౌంట్లో వేతనాన్ని జమ చేయాలన్నారు.జీఓ ప్రకారం వేతనాలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రతి చిన్న తప్పుకు ఉద్యోగులను బెదిరిస్తూ ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటే ఏ ఐ టి యు సి చూస్తూ ఊరుకోదని ఎల్లవేళలా కార్మిక అండగా పోరాటాలు చేస్తుందని హెచ్చరించారు.రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బందికి  సమానంగా జీతాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం అందచేయాలని  కాంటాక్ట్ వర్కర్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పిఎఫ్ ఈఎస్ఐ వర్తింపజేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కావ్య విశ్వేశ్వరరావు కిరణ్ అర్జున్ వర్కర్స్ పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి