మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర కి వినతి పత్రం అందజేసిన సాలూరు డిపో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు.                                   పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తమ వేతనాలను పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఈరోజు సాలూరు పట్టణంలో ఏపీఎస్ఆర్టీసీ కాంప్లెక్స్ దరి ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు.ఈ ధర్నా కార్యక్రమంలో  *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు& రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు శ్రీ పీడిక.రాజన్నదొర* గారు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భం *మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర* గారికి ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు వారి సమస్యలను విన్నవించుకుంటూ వినతిపత్రాన్ని అందజేశారు.అద్దె బస్సులపై రోజుకు ఎక్కువసేపు విధులు నిర్వర్తిస్తున్నా తగిన వేతనం అందడం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.వేతనాలు పెంచి జీవనోపాధికి భరోసా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.వారికి సంఘీభావం తెలపడానికి వచ్చిన *మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర* గారికి ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ వైసిపి ప్రజాప్రతినిధులు,సిఐటియు నాయకులు,ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు మరియు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి