ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం వైసీపీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు మరియు మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర  పిలుపు మేరకు ఈరోజు సాలూరు పట్టణంలో వైయస్సార్ విగ్రహం వద్ద వైసిపి 16వ ఆవిర్భావ వేడుకలు వైసీపీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు మరియు తదితరులు ఘనంగా నిర్వహించారు.

*ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు కలిసి వైయస్సార్,సుభాష్ చంద్రబోస్ విగ్రహాలకి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ జెండాను ఎగురవేశారు.వైసీపీ నాయకులు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి,ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తూ ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.*

*ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొని ఆవిర్భావ దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు.*

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి