పార్వతీపురం, మార్చి 13: పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా దుకాణాలు, సంస్థలు మరియు వివిధ నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల ఆరోగ్యం, భద్రత విషయంలో యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పార్వతీపురం జిల్లా ఇన్-ఛార్జ్ అధికారి మరియు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ పి. సువర్ణ సూచించారు.

జిల్లా కలెక్టర్ డా. ఎన్ ప్రభాకర్ రెడ్డి  వారి సూచనలమేరకు శుక్రవారం పార్వతీపురంలో అపహోల్డ్ ఆర్గనై్సేషన్ సహకారంతో క్లోత్ మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ పి. సువర్ణ
ప్రసంగించారు. ఈ సందర్భంగా వేసవి కాలంలో హీట్ స్ట్రోక్ (వడదెబ్బ) వంటి అనారోగ్య సమస్యలను నివారించడానికి పని ప్రదేశాల్లో కల్పించాల్సిన కనీస మౌలిక వసతులపై అధికారుల బృందం యజమానులకు దిశానిర్దేశం చేశారు.

పని ప్రదేశాల్లో కార్మికులకు ఎప్పుడూ శుద్ధమైన తాగునీరు అందుబాటులో ఉండాలి. డీహైడ్రేషన్ నివారణకు ORS ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలి. అలాగే ప్రతి దుకాణం మరియు ఎస్టాబ్లిష్మెంట్‌లో అత్యవసర చికిత్స కోసం ఫస్ట్ ఎయిడ్ లేదా మెడికల్ కిట్ తప్పనిసరిగా ఉండాలి. తీవ్రమైన ఎండ సమయంలో కార్మికులు అలసిపోకుండా వారికి తగిన విశ్రాంతి సమయాన్ని కేటాయించాలన్నారు.

ఈ నియమాలు కేవలం దుకాణాలకే కాకుండా, భవన నిర్మాణ రంగ కార్మికులు, ఇటుక బట్టీలు, ఫ్యాక్టరీలలో పనిచేసే ప్రతి వర్కర్‌కు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం సూచించిన ఈ నిబంధనలను యజమానులు ఖచ్చితంగా పాటించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ డి. దేవి గణేష్, క్లోత్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు, మరియు అపహోల్డ్ ఆర్గనై్సేషన్ సభ్యులు పాల్గొన్నారు. అధికారుల సూచనలకు క్లోత్ మర్చెంట్స్ అసోసియేషన్ సానుకూలంగా స్పందిస్తూ, కార్మికుల సంక్షేమానికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి