*ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: వ్యాధుల మూలాలను గుర్తించి నివారించాలి*విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక నిఘా*జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి* పార్వతీపురం ఏప్రిల్ 01: ,: జిల్లాలో వ్యాధుల నివారణ, ప్రజారోగ్య పరిరక్షణపై జిల్లా కలెక్టర్ డా ఎన్. ప్రభాకర్ రెడ్డి గారు వైద్య ఆరోగ్య శాఖ మరియు వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఎక్కడైనా వ్యాధులు ప్రబలితే కేవలం చికిత్సకే పరిమితం కాకుండా, ఆ వ్యాధి రావడానికి గల కారణాలను, దాని మూలాలను విశ్లేషించాలని అధికారులను ఆదేశించారు.మలేరియా నివారణకు చేపట్టిన తరహాలోనే టైఫాయిడ్, వైరల్ జ్వరాల పట్ల గ్రామాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ సూచించారు. “కళాజాతర” కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పాటలను రూపొందించాలని ఆదేశించారు.*విద్యార్థుల ఆరోగ్యం – ప్రత్యేక మార్గదర్శకాలు*పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్న విద్యార్థులు వారం రోజుల పాటు మాస్కులు ధరించి విశ్రాంతి తీసుకోవాలి. చికెన్ పాక్స్ (ఆటలమ్మ) సోకిన విద్యార్థులను వెంటనే హోమ్ ఐసోలేషన్ చేసి, తగిన చికిత్స అందించాలి. నివారణ చర్యల్లో భాగంగా విద్యార్థులందరికీ హోమియోపతి మందులను పంపిణీ చేయాలని స్పష్టం చేశారు.ప్రతి విద్యార్థికి ఏడాదికి ఒకసారి తప్పనిసరిగా ఐ స్క్రీనింగ్ (కంటి పరీక్షలు) నిర్వహించాలని ఆదేశించారు.‘ఫ్యామిలీ ముస్తాబు’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇల్లు, పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలని.. వ్యక్తిగత పరిశుభ్రత, హ్యాండ్ వాష్ ప్రాముఖ్యతపై DRDA మరియు వైద్య శాఖ సమన్వయంతో ప్రజలను చైతన్యపరచాలన్నారు. అలాగే, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరుగుదొడ్లు పూర్తిస్థాయిలో వినియోగంలో ఉండాలని, లేనిచోట వెంటనే నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. మల్టీ పర్పస్ వర్కర్లు, మెడికల్ ఆఫీసర్లు మైక్ సెట్ లు కొనుగోలు చేసి ప్రచారం నిర్వహించాలన్నారు.మన్యం ప్రాంతం వెనుకబడిన జిల్లాగా కాకుండా, అభివృద్ధి మరియు ఆరోగ్య సూచికల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలని కలెక్టర్ అధికారులకు పిలుపునిచ్చారు. ఈ లక్ష్య సాధనలో జిల్లా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి సహకరించాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో డి సిహెచ్ స్ డా.జీ.నాగభూషణరావు, జిల్లా వైద్య ఆరోగ్యం శాఖ అధికారి భాస్కరరావు, జిల్లా విద్యాశాఖధికారి బ్రహ్మజీ, డా. జగన్, మెడికల్ ఆఫీసర్లు వైద్య ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. Spread the love టపా నావిగేషన్ పేదరికం లేని సమాజమే లక్ష్యం ఎలస్కో ఎలక్ట్రికల్ స్కూటీల నూతన షోరూమ్