పార్వతీపురం మన్యం జిల్లా: జిల్లాలో రేపు (ఏప్రిల్ 22) నిర్వహించాల్సిన భారీ ‘మెగా కోలాటం’ ప్రదర్శనను తీవ్రమైన ఎండల కారణంగా వాయిదా వేస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమం శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాయిదాకు గల కారణాలు వివరించారు. జిల్లాలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో, ప్రదర్శనలో పాల్గొనే సుమారు 6,000 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శన కోసం విద్యార్థులు ఇప్పటికే ఎంతో ఉత్సాహంతో శిక్షణ పొందారు. అయినప్పటికీ, పిల్లల క్షేమమే తమకు ముఖ్యమన్నారుఇటీవల నిర్వహించిన ‘డ్రగ్స్ వద్దు బ్రో’ కార్యక్రమంలో కూడా ఎండ వల్ల కొందరు విద్యార్థులు ఇబ్బంది పడ్డారని, అటువంటి పరిస్థితి పునరావృతం కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో, పిల్లలు ఎండల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని ఉష్ణోగ్రతలు తగ్గిన తర్వాత తిరిగి ఎప్పుడు నిర్వహించే తేదీ త్వరలోనే ప్రకటిస్తామన్నారు. Spread the love టపా నావిగేషన్ లైఫ్ జాకెట్స్ ఒళ్ళు అంతా కట్టుకొని 7వ రోజు రిలే నిరాహార దీక్ష