పోలీసు స్టేషన్లను ఆశ్రయించే మహిళల ఫిర్యాదుల పట్ల తక్షణమే చర్యలు చేపట్టాలన్న జిల్లా ఎస్పీ*మహిళల ఫిర్యాదుల పట్ల సానుకూలంగా స్పందించాలని, వారు చెప్పే ఫిర్యాదులను శ్రద్ధతో వినాలని ఆదేశం*మహిళలకు రక్షణగా నిలిచే చట్టాల పట్ల, శక్తి యాప్ పట్ల అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ*మహిళల భద్రతకు ప్రాధాన్యత కల్పించాలని, వారు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, వారి రక్షణకు భద్రత చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ ఏప్రిల్ 8న ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ మాట్లాడుతూ – మహిళలు, పిల్లల భద్రతకు అధిక ప్రాధాన్యత కల్పించాలని, వారు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, భద్రత చర్యలు చేపట్టాలన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను నియంత్రించుటలో భాగంగా పోలీసు స్టేషన్లను ఆశ్రయించే మహిళలు, వారు చేసే ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. పోలీసు స్టేషన్లకు వచ్చే మహిళలతో పోలీసు సిబ్బంది మర్యాదగా మాట్లాడాలని, వారు చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలని, వారు ఇచ్చే ఫిర్యాదులపట్ల సానుకూలంగా స్పందించి, చట్ట పరిధిలో వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. అంతేకాకుండా, విధిగా కళాశాలలు, పాఠశాలలను, మహిళలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను మహిళా పోలీసు సిబ్బంది, శక్తి బృందాలు సందర్శించి, వారికి రక్షణగా నిలిచే చట్టాలు పట్ల, శక్తి యాప్ పట్ల, సైబర్ మోసాలు పట్ల అవగాహన కల్పించాలన్నారు. ఆపద సమయంలో పోలీసులు సహాయం పొందే విధానంపట్ల అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసుశాఖ తరుపున చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, మహిళా పోలీసులు (ఎం.ఎస్.పి.లు), ఇతర పోలీసు సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ చేపట్టి తమ పోలీసు స్టేషను పరిధి లోని ముఖ్య కూడళ్లు, ఉన్నత పాఠశాలలు, కళాశాలలను, బస్టాండులు మరియు రైల్వే స్టేషన్ లను సందర్శించి ప్రజలు, మహిళలు, విద్యార్ధినులతో మమేకమై, వారికి అర్ధమయ్యే రీతిలో మహిళల రక్షణకు బాసటగా నిలిచే చట్టాలు, శక్తి యాప్ పట్ల, సైబర్ మోసాలు పట్ల అవగాహన కల్పించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశించారు. Spread the love టపా నావిగేషన్ ఆలయాల పవిత్రతను సంరక్షిస్తాంరాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మ్యుటేషన్స్ త్వరగా పూర్తిచేయాలి-జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్