పూసపాటిరేగకు చెందిన AP Institute’s MASTER MINDS School విద్యార్థిని, సంచాం గ్రామానికి చెందిన Ch. లాస్య ప్రతిష్టాత్మకమైన కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచి అరుదైన విజయాన్ని సాధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమ్మాయిలకు కేటాయించిన 10 సీట్లలో, OBC వర్గానికి కేటాయించిన ఒక్క సీటును ఆమె కైవసం చేసుకుంది. 300 మార్కులకు గాను 273 మార్కులు సాధించడం విశేషంగా నిలిచింది.ఈ సందర్భంగా విజయనగరం పార్లిమెంట్ సభ్యులు గౌరవ కలిశెట్టి అప్పలనాయుడు గారు, ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవ నడుకుర్తి ఈశ్వరరావు గారు లాస్యను అభినందించి ఆశీర్వదించారు.విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు మాట్లాడుతూ, చిన్న వయసు నుంచే విద్యార్థులను ఆల్ ఇండియా స్థాయి ప్రవేశ పరీక్షలకు సిద్ధం చేస్తూ 2026 సంవత్సరంలో 19 మంది విద్యార్థులు వివిధ సైనిక్ స్కూల్స్‌కు, అలాగే 6 మంది విద్యార్థులు నవోదయ స్కూల్‌కు ఎంపిక కావడంలో కీలక పాత్ర పోషించిన AP Institute’s MASTER MINDS School యాజమాన్యాన్ని అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. అలాగే, సంస్థ అభివృద్ధికి ఎల్లప్పుడూ తమ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.ఈ విజయంతో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. సెలెక్ట్ అయిన విద్యార్థులందరూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. Spread the love టపా నావిగేషన్ ఆపరేషన్ వజ్రప్రహార్”లో భాగంగా జిల్లాలో ‘కార్డన్ అండ్ సెర్చ్