పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు అధికారి S. V. మాధవరెడ్డి, (IPS) గారి ఆదేశాల మేరకు ఈ రోజు సాలూరు టౌన్ పోలీస్ వారు పట్టణ పరిధిలోని పలు సున్నిత మరియు అనుమానాస్పద ప్రాంతాల్లో డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు. పట్టణంలోని నిర్జన ప్రదేశాలు, బ్లాక్ స్పాట్లు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, వేగవతి నది పరివాహక ప్రాంతం, బంటి స్టేడియం మరియు ఇతర ముఖ్య ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా గగనతల పర్యవేక్షణ చేపట్టబడింది. ఈ సర్వైలెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అక్రమ కార్యకలాపాలు, మత్తు పదార్థాల వినియోగం మరియు రవాణా, అనుమానాస్పద వ్యక్తుల సంచారం, జూదం, ఆన్లైన్ బెట్టింగ్, అక్రమ మద్యం విక్రయాలు వంటి చట్ట విరుద్ధ చర్యలను గుర్తించి నివారించడం. డ్రోన్ పర్యవేక్షణ ద్వారా పరిస్థితిని సమీక్షించి, అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగించబడుతుంది. అవసరమైతే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. సాలూరు పట్టణంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ఇటువంటి ప్రత్యేక నిఘా చర్యలు నిరంతరం కొనసాగించబడతాయి. ప్రజలు ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించగలరు. Spread the love టపా నావిగేషన్ సాలూరు టౌన్ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం