మన్యం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ S. V. మాధవరెడ్డి , (ఐపీఎస్)ఆదేశాల మేరకు సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపట్టబడుతున్నాయి.
ఈ రోజు సాలూరు ఏరియా ఆసుపత్రి సమీపంలోని పాడుబడిన మరియు నిర్జన ప్రదేశాలలో సాలూరు టౌన్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి, గంజాయి సేవనం చేస్తున్నారా లేదా అన్నది నిర్ధారించేందుకు ప్రత్యేక డ్రగ్ టెస్టింగ్ కిట్ల సహాయంతో పరీక్షలు నిర్వహించారు.పరీక్షల్లో ఎవరైనా గంజాయి సేవనం చేసినట్లు తేలిన పక్షంలో, సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడటం, సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించడం పోలీసుల ముఖ్య ఉద్దేశమని గంజాయి రహిత జిల్లా” సాధన దిశగా ఈ ప్రత్యేక డ్రైవ్‌లు నిరంతరంగా కొనసాగుతాయ ని,ప్రజలు గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేయడమైనది. పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి