సాలూరు పట్టణంలోని పెదవీధి ప్రాంతానికి చెందిన ఎనిమిది (08) మంది వ్యక్తులు ఇటీవల ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ప్రజల్లో ఆందోళన సృష్టించినట్లు గుర్తించబడింది.ఈ నేపథ్యంలో, ప్రజా శాంతి భద్రతలను పరిరక్షించుటకై సాలూరు టౌన్ పోలీసులు భారతీయ నాగరిక సురక్షా సంహిత, 2023 సెక్షన్ 126 (పూర్వపు 107 Cr.P.C.) ప్రకారం నివారణ చర్యలు ప్రారంభించారు.అనంతరం పై ఎనిమిది మందిని గౌరవనీయ మండల కార్యనిర్వాహక మేజిస్ట్రేట్ సురేష్ గారి సమక్షంలో హాజరు పరచగా, మేజిస్ట్రేట్ వారిని శాంతి భద్రతలు కాపాడుటకు మరియు మంచి ప్రవర్తన పాటించుటకు ప్రతి వ్యక్తి రూ.2,00,000/- విలువైన బాండ్‌ను నిర్దిష్ట కాలానికి అమలు చేయాలని ఆదేశించారు.సాలూరు పట్టణంలో శాంతి భద్రతలు పరిరక్షించుటకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు ఎవరైనా శాంతి భంగం కలిగించే చర్యలను గమనించిన పక్షంలో వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని.ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సాలూరు వారు తెలిపారు Spread the love టపా నావిగేషన్ నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సంధ్య రాణి సాలూరు లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ