సెంచూరియన్ యూనివర్సిటీని సందర్శించిన మాజీ ఉపముఖ్యమంత్రి రాజన్నదొర

మాజీ ఉపముఖ్యమంత్రి రాజన్నదొర గారిని సత్కరించిన సెంచూరియన్ యూనివర్సిటీ యాజమాన్యం*

విజయనగరం సమీపంలోని రోళ్లవాక గ్రామంలో ఉన్న సెంచూరియన్ యూనివర్సిటీని *మాజీ ఉపముఖ్యమంత్రి,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పీడిక.రాజన్నదొర* గారు ఈరోజు సందర్శించారు.

యూనివర్సిటీ యాజమాన్యం ప్రత్యేక ఆహ్వానం మేరకు రాజన్నదొర గారు ఈ సందర్శన చేపట్టారు. గతంలో తాను ఉపముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యూనివర్సిటీ నిర్వహించిన ఒక కార్యక్రమానికి ఆహ్వానం అందినప్పటికీ,అధికారిక కార్యక్రమాల కారణంగా హాజరు కాలేకపోయినట్లు ఆయన పేర్కొన్నారు.ఆ సందర్భంగా ఇచ్చిన ఆహ్వానాన్ని గుర్తుంచుకుని, ఈరోజు యూనివర్సిటీని సందర్శించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా యూనివర్సిటీ యాజమాన్యం మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారిని మర్యాదపూర్వకంగా స్వాగతించి, విద్యాసంస్థలోని విద్యా, మౌలిక సదుపాయాలు, వివిధ విభాగాల కార్యకలాపాలను వివరించారు.అనంతరం యూనివర్సిటీ ప్రాంగణాన్ని ఆయన పరిశీలించి, యాజమాన్యంతో పలు అంశాలపై సౌహార్దపూర్వకంగా చర్చించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి