సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమడాం గ్రామంలో 2026 ఏప్రిల్ నెల మొదటి వారంలో జరిగిన ఇంటి దొంగతనం కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితుల వద్ద నుండి సుమారు రూ.3,00,000/- విలువైన బంగారు ఆభరణాలు, సుమారు రూ.2,00,000/- విలువైన KTM ద్విచక్ర వాహనం, మరో ద్విచక్ర వాహనం, అలాగే మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, A-1 గుమడాం గ్రామానికి చెందిన వ్యక్తి అని తన విలాసవంతమైన జీవనం, చెడు అలవాట్లు మరియు ఆర్థిక అవసరాల కారణంగా అదే గ్రామంలోని ఒక ఇంటిలో దొంగతనానికి పాల్పడ్డాడు అని,
మరో ఇద్దరు A-2 రామభద్రపురం మండలం, కొండకెంగువ గ్రామానికి చెందినవాడు. A-3 విశాఖపట్నం నగరానికి చెందినవాడు గా తెలిపారు. వీరిద్దరూ దొంగిలించిన బంగారు ఆభరణాలు మరియు ఇతర సొత్తును విక్రయించడం/దాచిపెట్టడం వంటి చర్యల్లో A-1కు సహకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
దొంగిలించిన బంగారు ఆభరణాల లో కొంత భాగాన్ని బంగారు దుకాణంలో విక్రయించి నట్లు తెలిపారని వాటిని చట్టపరమైన విధానంలో స్వాధీనం చేసుకునేందుకు చర్యలు కొనసాగుతున్నాయి అని. మిగిలిన దొంగతనం సొత్తు రికవరీ కోసం దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.
ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న సొత్తు
బంగారు ఆభరణాలు 3 తులాలు – సుమారు రూ.3,00,000/-
KTM ద్విచక్ర వాహనం – సుమారు రూ.2,00,000/-
మరో ద్విచక్ర వాహనం
మూడు మొబైల్ ఫోన్లు
నగదు 19,000/- రూపాయలు
ఈ దొంగతనం కేసు దర్యాప్తును పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, ఐపీఎస్ గారు మరియు అదనపు పోలీసు సూపరింటెండెంట్ శ్రీ . వెంకటేశ్వరరావు గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, దర్యాప్తు బృందానికి అవసరమైన మార్గనిర్దేశం చేశారు. వారి పర్యవేక్షణలో సాలూరు టౌన్ పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ మరియు ఇతర శాస్త్రీయ దర్యాప్తు పద్ధతులను సమర్థవంతంగా వినియోగించి కేసును త్వరితగతిన ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, దొంగతనం సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి