*విశాఖపట్నం, ఆగస్టు 9:*

విశాఖపట్నం సిరిపురం జంక్షన్‌లోని ఉడా చిల్డ్రన్స్ థియేటర్‌లో నిర్వహించిన మాజీ మంత్రి, ప్రముఖ రాజకీయ నాయకులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభలో *విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.

ఈ సంతాప సభకు శాసనమండలి ప్రతిపక్ష నేత *శ్బొత్స సత్యనారాయణ , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు *శ్రీ కొరసాల కన్నబాబు శ్రీ గుడివాడ అమర్నాథ్

హాజరై ముద్రగడ పద్మనాభం గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం గారి ప్రజా జీవితాన్ని, ప్రజా సమస్యలపై ఆయన సాగించిన పోరాటాలను స్మరించుకున్నారు. ప్రజా సమస్యలపై పట్టుదలతో పోరాడిన నాయకుడిగా, తన నమ్మిన సిద్ధాంతాల కోసం రాజీలేని పోరాటాలు చేసిన వ్యక్తిగా ఆయనకు రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్నారు.

పలు సందర్భాల్లో నిరాహార దీక్షలు చేపట్టి ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లిన ముద్రగడ పద్మనాభం గారి పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని చిన్న శ్రీను గారు అన్నారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ముద్రగడ పద్మనాభం గారి మృతి ప్రజా జీవితానికి తీరని లోటని, ఆయన ప్రజా సేవలు, పోరాట పంథా ఎప్పటికీ గుర్తుండిపోతాయని నాయకులు పేర్కొన్నారు.

ఈ సంతాప సభలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి