పారాది వద్ద నూతన బ్రిడ్జి సమీపంలో యువకుడి అనుమానాస్పద మృతి సాలూరు: పారాది గ్రామం వద్ద నూతనంగా ప్రారంభించిన బ్రిడ్జి సమీపంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడిని ఉత్తరావరి సంతోష్గా గుర్తించినట్లు సమాచారం. బ్రిడ్జి వద్ద సంతోష్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. యువకుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. మృతికి ప్రమాదమా, ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.https://9newstelugu.com/wp-content/uploads/2026/09/VID-20260910-WA0059-1.mp4 Spread the love టపా నావిగేషన్ గణపతి మండపాలకు అనుమతుల పేరుతో ఆంక్షలు వద్దు