పాచిపెంట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో తల్లిపాలు వారోత్సవాలు నిర్వహణ పాచిపెంట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని పి. కొనవలస సెక్టార్లోని పనుకువలస అంగన్వాడి కేంద్రంలో తల్లిపాలు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఏ. జ్యోతి పాల్గొని గర్భిణీలు, బాలింతలు, ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల లోపు పిల్లల తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. పుట్టిన వెంటనే శిశువుకు ముర్రుపాలు తప్పనిసరిగా పట్టాలని, ప్రతి బిడ్డకు రెండు సంవత్సరాల వయస్సు పూర్తయ్యే వరకు తల్లిపాలు అందించాలని సూచించారు. తల్లిపాల వల్ల శిశువుకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, పౌష్టికాహారం అవసరం, పరిశుభ్రత పాటించాల్సిన విధానాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు సీహెచ్. సూరమ్మ, ఎన్. బంగారమ్మ, గర్భిణీలు, బాలింతలు, పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ మక్కువ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ పనులను పరిశీలించిన ఆర్డీవో