విజయవాడ

మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా మూడవ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలు 20 26 జూలై 11, 12 తేదీలలో యద్దనపూడి సులోచనారాణి సభా ప్రాంగణం కేబీఎన్ కళాశాలలో వైభవంగా రెండు రోజులు పాటు జరిగాయి, ఈ ఉత్సవాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దేశ విదేశాల నుండి ప్రముఖ రచయిత్రులు వచ్చి పాల్గొన్నారు, మహాసభలకు గుత్తికొండ సుబ్బారావు గారు, డాక్టర్ జీవి పూర్ణచంద్ గారు సారథ్యం వహించి అద్భుతంగా కార్యక్రమాన్ని జరిపించారు. ఈ సభలలో రచయిత్రులందరూ ఒకచోట చేరి వారి మనోభావాలను పంచుకున్నారు. మహిళా అభ్యుదయం గురించి మహిళల సాధికారత గురించి ఇలా అనేక విషయాల మీద చర్చించుకోవడం జరిగింది. మూడవ వేదిక ఇల్లిందల సరస్వతి దేవి సభా వేదిక వద్ద విజయనగరానికి చెందిన శ్రీమతి గొర్తి మహాలక్ష్మికి కవి సమ్మేళనం లో సన్మానించడం జరిగింది. గుత్తికొండ సుబ్బారావు గారి 80వ జన్మదిన పురస్కరించుకొని ప్రమ దావనం అను గ్రంధాన్ని వారి కుమార్తెలు రచయిత్రులకు సమర్పించారు. అందులో విజయనగరానికి చెందిన శ్రీమతి గొర్తి మహాలక్ష్మి గారి గురించి వివరంగా రాసారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి