జిల్లాలోని ముఖ్యమైన వ్యక్తులకు, తీవ్రవాదులు నుండి ముప్పు ఉన్న వ్యక్తులకు భద్రత విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి (పి.ఎస్.ఓ.లకు) రెండు రోజులపాటు పునశ్చరణ తరగతులను నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ముఖ్య అతిధిగా హాజరై, శిక్షణ కార్యక్రమాన్ని ఏప్రిల్ 21న ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ మాట్లాడుతూ – వ్యక్తిగత భద్రత విధులు (పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్) నిర్వహించే పోలీసు సిబ్బంది (పి.ఎస్.ఓ.లు) తమ విధులు నిర్వహించే సమయంలో నిరంతరం అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. భద్రత విధుల నిర్వహణలో సిబ్బందికి శారీరక దారుఢ్యం, వృత్తి నైపుణ్యం వారిని ఉత్తమంగా నిలుపుతుందన్నారు. ఈ శిక్షణలో పోలీసు సిబ్బందిలో శారీరక దారుఢ్యం పెంపొంచేందుకు, విఐపి సెక్యూరిటీలో నిర్వహించాల్సిన విధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైరింగు ప్రాక్టీసు, విఐపి భద్రత విధుల నిర్వహణలో ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అన్న అంశాలు, బాంబ్ డిస్పోజల్ విధుల పట్ల పునశ్చరణ తరగతులను రెండు రోజులపాటు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పునశ్చరణ తరగతులను వ్యక్తిగత భద్రత విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది సద్వినియోగం చేసుకొని, తమ వృత్తి నైపుణ్యాన్ని, శారీరక సామర్ధ్యాన్ని మెరుగుపర్చుకోవాలన్నారు. పి.ఎస్.ఓ. విధులు ఎక్కడ, ఎవరి వద్ద నిర్వహించిన క్రమశిక్షణతో మెలగాలని, నీట్ యూనిఫాం, చక్కని శారీరక దారుఢ్యంతో కనిపించాలని, విధుల నిర్వహణలో చురుకుగా వ్యవహరిస్తూ, విఐపి భద్రతకు ప్రాధాన్యతను కల్పించాలన్నారు. ముఖ్య వ్యక్తుల భద్రత నిర్వహించే పి.ఎస్.ఓ.లు చెడు వ్యసనాలకు దూరంగా, మంచి నడవడికతో ఉండాలని తద్వారా జిల్లా పోలీసుశాఖ ప్రతిష్టను పెంచాలన్నారు. పి.ఎస్.ఓ. విధులను ఒకవైపు సక్రమంగా నిర్వహిస్తూనే మరోవైపు వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబం భద్రత, సంక్షేమం, పిల్లల బాధ్యతల పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని శిక్షణలో పాల్గొన్న పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సూచించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో సెక్యూరిటీ ఆర్.ఐ. పి.శ్రీనివాసరావు, అడ్మిన్ ఆర్.ఐ. ఎన్.గోపాల నాయుడు, ఎం.టి. ఆర్ఐ ఆర్.రమేష్ కుమార్, ఆర్ఎస్ఐ ముబారక్ అలీ వ్యక్తిగత భద్రత విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది (పి.ఎస్.ఓ.లు) పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి