పార్వతీపురం, జూలై 31: పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారి మాధురి శుక్రవారం మక్కువ తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా పాత రెవెన్యూ రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరిచే ప్రక్రియ, స్కానింగ్, డేటా నమోదు, రికార్డుల ధ్రువీకరణ తదితర పనులు వేగవంతం చేయాలని సిబ్బంది ఆదేశించారు.

డిజిటలైజేషన్ ప్రక్రియను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
భవిష్యత్తులో ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు డిజిటలైజేషన్ కీలకమని పేర్కొన్నారు. ప్రతి రికార్డును అత్యంత జాగ్రత్తతో పరిశీలించి డిజిటల్ రూపంలో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ తనిఖీలో మక్కువ తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి