పార్వతీపురం మన్యం జిల్లా, పాచిపెంట: పాచిపెంట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో, సీడీపీఓ బి. అనంతలక్ష్మి ఆదేశాల మేరకు పాచిపెంట మండలంలోని కోస్ట్ వలస అంగన్వాడీ కేంద్రంలో సూపర్వైజర్ ఏ. జ్యోతి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ బి. అనంతలక్ష్మి మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. శిశువు జన్మించిన గంటలోపే ముర్రుపాలు (కొలస్ట్రం) ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు సంపూర్ణ పోషణ లభిస్తుందని తెలిపారు. తల్లిపాలు శిశువుకు అమృతంతో సమానమని పేర్కొన్నారు. జననం నుంచి మొదటి ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, దీంతో శారీరక, మానసిక వికాసం మెరుగ్గా ఉంటుందని చెప్పారు. అలాగే ఊబకాయం, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని వివరించారు. ఆరు నెలల తర్వాత అదనపు ఆహారంతో పాటు రెండేళ్ల వయస్సు వరకు తల్లి.పాలు కొనసాగించడం అవసరమని సూచించారు. తల్లిపాలు ఇవ్వకపోవడం వల్ల తల్లుల్లో రొమ్ము క్యాన్సర్ (బ్రెస్ట్ క్యాన్సర్) వచ్చే ప్రమాదం పెరిగే అవకాశం ఉందని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ బి. అనంతలక్ష్మి, సూపర్వైజర్ ఏ. జ్యోతి, వరల్డ్ న్యాచురల్ ఫౌండేషన్ తిరుపతి రావు , గర్భిణీలు బాలింతలు మరియు పిల్లల తల్లులు, అంగన్వాడి కార్యకర్తలు సెక్టర్ లీడర్ N.బంగారమ్మ, ch . వరలక్ష్మి, ch. సూరమ్మ, D. దేవరత్నం.. పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ పాచిపెంట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో తల్లిపాలు వారోత్సవాలు నిర్వహణ