న్యూఢిల్లీ, ఆగస్టు 17: గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. గోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ప్రత్యేక భేటీ జరిగింది. ఈ సందర్భంగా అశోక్ గజపతి రాజు గారు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి ప్రతిమను ప్రధాని నరేంద్ర మోదీ గారికి జ్ఞాపికగా అందజేశారు. సింహాచలం అప్పన్న స్వామి విశిష్టతను ప్రధానికి వివరించారు. అశోక్ గజపతి రాజు గారి ఆరోగ్య పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోదీ అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్యంపై ప్రత్యేకంగా ఆరా తీసి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అశోక్ గజపతి రాజు సింహాచలం శ్రీ అప్పన్న స్వామి వారిని దర్శించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. సింహాచలం వచ్చి స్వామివారిని దర్శించుకునేందుకు ప్రధాని సుముఖత వ్యక్తం చేశారు. కాగా గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ , కేంద్ర హోంమంత్రి అమిత్ షా లతో భేటీ కానున్నారు. Spread the love టపా నావిగేషన్ విజయవంతంగా ముగిసిన స్వతంత్ర దినోత్సవ వేడుకలు