*

*విజయనగరం, సెప్టెంబర్ 5:*

*విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) * జన్మదినం సందర్భంగా కుటుంబ సమేతంగా ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా చిన్న శ్రీను గారు వారి సతీమణి శ్రీమతి *మజ్జి పుష్పాంజలి ,* కుమార్తె *సిరమ్మ* అల్లుడు *ప్రదీప్ నాయుడు* కుమారుడు *మోహిత్ బాబు* తో కలిసి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు.

అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, శాంతి, శ్రేయస్సులతో జీవించాలని, ప్రతి కుటుంబంపై అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చిన్న శ్రీను గారికి, కుటుంబ సభ్యులకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు.

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ మేలు జరగాలని, జిల్లా మరింత అభివృద్ధి సాధించాలని చిన్న శ్రీను గారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి