సాలూరు రిషి పాఠశాలలో అంగరంగ వైభవంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరిగాయి . ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హేమంత్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన కార్యక్రమం , విద్యార్థుల ఆటపాటల నడుమ, ఉపాధ్యాయుల ఉత్తేజ పూర్వక ఉపన్యాసాల నడుమ ఆద్యంతం ఉత్సాహంగా నడిచింది. ఉపాధ్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణ గారి బహుముఖీన ప్రతిభను, ఔన్నత్యాన్ని కొనియాడారు. ప్రతి పాఠశాల నుండి ఉత్సు కత కలిగిన విద్యార్థులు ఉపాధ్యాయ వృత్తి దిశగా అడుగులు వేయాలని కాంక్షించారు. ఈ కార్యక్రమం విద్యార్థులలో స్ఫూర్తిని నింపింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి