*//జామి మండలం, అన్నంరాజుపేట గ్రామంలో నిర్వహించిన “మెగా పల్లెనిద్ర’ కార్యక్రమంలో పాల్గొన్న విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్//* క్షేత్ర స్థాయిలో ప్రజలతో పోలీసులు మమేకమై, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాల తీరు పట్ల, సామాజ రుగ్మతల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి, వారిని చైతన్యపర్చేందుకు జిల్లా వ్యాప్తంగా సెప్టెంబరు 5న రాత్రి ఒక్క రోజునే *సుమారు 1100మంది పోలీసు అధికారులు, సిబ్బందితో* కలసి *360 గ్రామాల్లో ‘మెగా పల్లె నిద్ర’* కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ *ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* జామి మండలం అన్నంరాజుపేట గ్రామంలో నిర్వహించిన మెగా పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ గారు మాట్లాడుతూ – మైనరు బాలికలు సోషల్ మీడియా మోజులో పడి, ఆకతాయిల వలలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. మైనరు బాలికల పట్ల ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడితే వారిపై పోక్సో చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. మహిళల భద్రతకు ప్రతీ ఒక్కరు తమ మొబైల్ ఫోన్లులో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, ఆపద సమయాల్లో యాప్ లోని SOS బటన్ ప్రెస్ చేసి సులభంగా పోలీసుల సహాయం పొందవచ్చునని జిల్లా ఎస్పీ సూచించారు. యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. గంజాయి వినియోగిస్తే, దాని ప్రభావం వలన విచక్షణ మరిచి ప్రవర్తించే స్థితికి చేరిపోతారన్నారు. గంజాయి వినియోగించినా, రవాణ చేసినా, విక్రయించినా, కలిగిఉన్నా కఠిన చర్యలు తప్పవన్నారు. గంజాయి నేరానికి 20 నుండి 30 సం.లు వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందన్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి గురించి ఏదైనా సమాచారం ఉంటే డయల్ 100 లేదా1972కు ఫిర్యాదు చేయాలన్నారు. యువత రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ ధరించాలని, డ్రంకన్ డ్రైవ్ చేయవద్దని, అతి వేగంగా వాహనాలు నడపవద్దని కోరారు. యువత క్రికెట్, జూదం యాప్ లతో బెట్టింగులకు పాల్పడి, ఆర్థికంగా నష్టపోయి, అప్పులకు పాల్పడుతూ, వాటిని తిరిగి చెల్లించలేక, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. జీవితాలను నాశనం చేసే బెట్టింగులకి యువత దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ కోరారు. సైబర్ మోసాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ నేరగాళ్ళు అనేక రకాలుగా ప్రజలను మభ్య పెడతారన్నారు. ప్రజలు అటువంటి ప్రలోభాలకు దూరంగా ఉండాలన్నారు. గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు ఉండడం సహజమేనని, వాటిని సామరస్య పూర్వకంగా, శాంతియుతంగా పెద్దలు సమక్షంలో పరిష్కరించుకోవాలని, ప్రతీ చిన్న విషయానికి గొడవలుపడి, గ్రామాల్లో సమస్యలు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామన్నారు. త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికల రానున్నందున ప్రజలు పోలీసుశాఖకు సహకరించాలన్నారు. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్య నేరమని జిల్లా ఎస్పీ తెలిపారు. గ్రామాల్లో విభిన్న కులాలు, మతాలు వారు ఉంటారని, ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే వివక్ష వద్దన్నారు. ఎవరు కుల దూషణలకు పాల్పడినా, వివక్ష చూపినా, వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ప్రతీ ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. మైనరు బాలికల పట్ల అమానుషంగా ప్రవర్తించే వ్యక్తులు మన చుట్టు ప్రక్కలే ఉంటారని, వారి దుర్బుద్ధిని గమనించి, అప్రమత్తతో వ్యవహరించాలన్నారు. యువత చెడు మార్గాలకు దూరంగా ఉండాలని, ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని, లక్ష్యం వైపు ముందుకు సాగాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ గారు పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ గారు “మీతో మీ ఎస్పీ” కరపత్రాలను యువత మరియు ప్రజలకు అందచేసి, గ్రామ పెద్దలతో సమావేశమై గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ మెగా పల్లెనిద్ర కార్యక్రమంలో ఎస్.కోట రూరల్ సిఐ హిమగిరి, స్పెషల్ బ్రాంచ్ సిఐ ఏవీ లీలారావు, జామి ఎస్ఐ వీర జనార్ధన్, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, యువత పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ జన్మదినం సందర్భంగా పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న చిన్న శ్రీను