విజయనగరం: గణపతి మండపాల ఏర్పాటుకు ప్రభుత్వం, పోలీసుల అనుమతులు తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ విజయనగరం జిల్లా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం విజయనగరం కోట జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. హిందువులు అనాదిగా తమ ఆచార సంప్రదాయాలను, పండుగలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారని విశ్వహిందూ పరిషత్ నాయకులు పేర్కొన్నారు. అయితే హిందూ పండుగల నిర్వహణకు మాత్రమే అనుమతుల పేరుతో వివిధ రకాల ఆంక్షలు విధించడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. గణపతి నవరాత్రుల సందర్భంగా మండపాల ఏర్పాటు, పూజా కార్యక్రమాలను శాంతియుతంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. పండుగల నిర్వహణలో భద్రత, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకునే చర్యలకు తాము సహకరిస్తామని, అయితే అనవసరమైన ఆంక్షలు విధించవద్దని విజ్ఞప్తి చేశారు. “మా పండుగలు – మా సంప్రదాయాలు. హిందూ పండుగల నిర్వహణపై అనవసరమైన ఆంక్షలు వద్దు” అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ విజయనగరం జిల్లా నాయకులు, సభ్యులు, కార్యకర్తలు, హిందూ బంధువులు పాల్గొన్నారు. 9న్యూస్ రిపోర్టర్ శ్రావణ్ కుమార్ Spread the love టపా నావిగేషన్ ప్రత్యేక పూజలతో స్వధర్మంలోకి ఆహ్వానం పారాది వద్ద నూతన బ్రిడ్జి సమీపంలో యువకుడి అనుమానాస్పద మృతి