సాలూరు: సాలూరు మండలంలోని సారికి గ్రామంలో ఓ కుటుంబాన్ని ప్రత్యేక పూజా కార్యక్రమం ద్వారా స్వధర్మంలోకి ఆహ్వానించినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామానికి చెందిన చందాపురం సింహాచలం (50), కన్నమ్మ (45), గణేష్ (28), భానుమతి (23), దిలీప్ (25), శ్రవంతి (20) కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరు కొర్ర గోత్రానికి చెందినవారని, గత నాలుగు సంవత్సరాలుగా చర్చి కార్యక్రమాలకు వెళ్తున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించి, సంప్రదాయ పద్ధతుల్లో వారిని స్వధర్మంలోకి ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. ధర్మాచరణ, ఆధ్యాత్మిక విలువలు, సనాతన సంప్రదాయాలపై ఈ సందర్భంగా అవగాహన కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ధర్మ ప్రచారకులు శ్రీ సింగిడి నర్సింగరావు, గ్రామ కన్వీనర్ శ్రీ నెమలపురి వెంకటరావు, గ్రామ ధార్మిక బృందం సభ్యులు పాల్గొన్నారు. 9 న్యూస్ రిపోర్టర్ శ్రావణ్ కుమార్ Spread the love టపా నావిగేషన్ గిరిజనులకు సాగు పట్టాలు ఇవ్వకుంటే ఉద్యమం తప్పదు: సీపీఐ హెచ్చరిక గణపతి మండపాలకు అనుమతుల పేరుతో ఆంక్షలు వద్దు